28, అక్టోబర్ 2021, గురువారం

రాధేశ్యామ్ రియల్ కథ

ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా కథకు రియల్ లైఫ్ ఫామిస్ట్ ఆధారం అని తెలుస్తోంది. 

ఐరిష్ కు చెందిన ఫేమస్ జ్యోతిష్కులలో ఒకరైన జాన్ వార్నర్  హస్తసాముద్రికం, సంఖ్యాశాస్త్రం ద్వారా ప్రపంచంను ఆశ్చర్యపరచడం గమనార్హం. ఇతని జీవిత చరిత్ర ఆధారంగానే రాధేశ్యామ్ తెరకెక్కిందని రియల్ కథకు కమర్షియల్ హంగులు అద్ది రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో లవ్ స్టోరీకి కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో కనిపిస్తుండగా ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.రియల్ కథ కాబట్టే ఈ సినిమా షూటింగ్ విదేశాలలో ఎక్కువగా జరిగిందని సమాచారం. సాహో సినిమాతో ఆశించిన స్థాయి హిట్ ను అందుకోని ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. జిల్ తో యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కిస్తాననే నమ్మకంతో ఉన్నారు.

'గని' సినిమా టైటిల్ సాంగ్ విడుదల

మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న 'గని' సినిమా లోని టైటిల్ సాంగ్ విడుదలయ్యి మంచి హిట్ అయ్యింది.వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే బాక్సింగ్ నేపథ్యంలోని సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

నిన్న సాయంత్రం విడుదలైన టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాట చాలా వెరైటీగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉందని చెబుతున్నారు. వరుసగా రెండు హ్యాట్రిక్ చిత్రాలను విజయాలను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో సైతం మంచి విజయం సాధించి ముందుకు దూసుకుపోవాలని భావిస్తున్నారు. ఇకపోతే ఆయన చేస్తున్న ఈ సినిమాను మెగా హీరో లైనా పవన్ 'తమ్ముడు' అలాగే రామ్ చరణ్ 'ధ్రువ' సినిమాలతో పోలిస్తూ ఉన్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ చిత్రం ఏ రేంజ్ విజయం సాధిస్తుందో చూడాలి. ఇకపోతే వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు బాగా వస్తున్నాయి.

23, అక్టోబర్ 2021, శనివారం

'మా' ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు

  'మా' ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్.

 తాజాగా ఆయన తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా కొన్ని ఫోటోలను, అలాగే ఎన్నికల అధికారికి వారు రాసిన లేఖను ట్వీట్ చేశారు.'మా ఎలక్షన్స్ 2021. ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి.ఎన్నికలలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసేలా చేస్తాము. ఎలక్షన్స్ ఎలా జరిగాయి? జస్ట్ ఆస్కింగ్ ' అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో ప్రకాష్ రాజ్ రౌడీ షీటర్ అని ఆరోపిస్తున్న సాంబశివరావు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబు పక్కనే ఉండడం కనిపిస్తోంది.

కేవలం ఎన్నికల్లోనే కాకుండా అతను మోహన్ బాబు కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ ఎన్నికలలో ఏపీ రాజకీయాలు కూడా ఎంట్రీ అయ్యాయా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై మంచు విష్ణు ప్యానల్, మోహన్ బాబు, అలాగే ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఫలితం లేదని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి డిలీట్ సీన్ రిలీజ్

అక్కినేని నాగార్జున వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్..మొత్తానికి హిట్ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ..దసరా సందర్భాంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.మొదటి రోజు మొదటి ఆట తోనే హిట్ టాక్ రావడం తో కలెక్షన్స్ కూడా కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా సినిమాలో డిలీట్ చేసిన పెళ్లిచూపులు సీన్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

ఈ డిలీట్ చేసిన వీడియోలో అఖిల్ తన యాక్టింగ్ అదరగొట్టాడు. పెళ్లి చూపుల కోసం వెళ్లి అమ్మాయి ను ఉరకంటి తో చూస్తూ..ఆమె ముందు షర్ట్ విప్పి.. రచ్చ చేస్తాడు. అయితే ఈ సీన్ ను సినిమాలో మొదట పెట్టాలని అనుకున్న చిత్రబృందం. కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసింది. అయితే తాజాగా ఆ డిలీట్ చేసిన వీడియోలను అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఈ సీన్ పెట్టాల్సింది..థియేటర్స్ లో అరుపులే ఉండే అని కామెంట్స్ వేస్తున్నారు.

డార్లింగ్‌ పెళ్లి ఎప్పుడు?

 బాహుబలి` సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.అయితే గత పదేళ్ల నుంచీ ఈయన పెళ్లిపై రకరకాల రూమర్లు వచ్చాయి.

నేడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన సినీ కెరీర్ అద్భుతంగా ఉంటుందని తెలిపిన జ్యోతిష్యులు.. ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎప్పుడు అన్న విషయాన్ని కూడా ఓ అంచనా వేసి చెప్పారు.ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన వివాహం 2023 ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యలో అవుతుందని తెలిపారు. ఒకవేళ అది మిస్సైతే కనుక 2025 వరకు ప్రభాస్ పెళ్లి అయ్యే అవకాశం లేదని అంటున్నారు. దీంతో ప్రభాస్ పెళ్లి కోసం ఇప్పటికే చాలా ఏళ్ల నుంచీ ఎదురు చూస్తున్న అభిమానులు.. జ్యోతిష్యుల వ్యాఖ్యలతో ఇంకా రెండేళ్లు ఆగాలా అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

రొమాంటిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆకాష్ పూరి ఎమోషనల్ స్పీచ్

ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించారు.ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆకాష్ పూరి మాట్లాడుతూ "ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎక్కడో నర్సీపట్నం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు మా నాన్న. సాఫీగా సాగిపోతున్న తమ లైఫ్ లో ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం వలన తన తండ్రి ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో పూరి పనైపోయిందని.. ఇక సినిమాలు చేయలేడని.. రొటీన్ సినిమాలు చేసుకుంటున్నాడని కామెంట్స్ చేశారు. తన తండ్రిని ఎవరైనా కామెంట్ చేస్తే ఇంటికెళ్లి మరీ కొట్టాలనిపించేదని ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ గా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో కాలర్ ఎగరేసేలా చేశారు" అని ఆకాష్ చాలా గర్వంగా చెప్పుకొచ్చారు.

అలానే తను హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అయిందని.. ఈ మూడేళ్లలో తనపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయని.. 'వీడేం హీరో.. బొంగు అవుతాడు వీడు హీరో' అని విమర్శలు చేశారని చెప్పారు. కానీ కచ్చితంగా అందరూ మెచ్చే హీరో అవుతానని ఎంతో నమ్మకంగా చెప్పారు. తన తండ్రి కాలర్ ఎగరేసేలా సక్సెస్ అవుతానని ఆకాష్ స్టేజ్ పై చెప్పుకొచ్చారు. ఆకాష్ మాట్లాడుతున్నంతసేపు ఎంతో జోష్ గా, మొహమాటం లేకుండా మాట్లాడడంతో స్టేడియం మొత్తం అరుపులు వినిపించాయి.

నాట్యం సినిమాకి ఉపరాష్ట్రపతి అభినందనలు

సంధ్య రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు దిల్ రాజు సంధ్య రాజుల సంయుక్తంగా నిర్మించడం జరిగింది.ఈ సినిమా ఈ రోజున థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుంది.

"నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు.సినిమా ఎంతో అద్భుతంగా ఉన్నది" అని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.  

ఇక అంతరించిపోతున్న కళాకారుల జీవితాలను, మళ్లీ వెలుగులోకి నింపే విధంగా ఈ సినిమానే తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉన్నది. అంతే కాకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరిని బాగా అలరిస్తోంది. 

రాధేశ్యామ్ రియల్ కథ

ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్...